Brahmamudi : ఆ బిడ్డ కన్న తల్లి ఎవరో తెలిసిపోయింది .. షాక్ లో కావ్య?
బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
దిశ, సినిమా: బ్రహ్మముడి ఎపిసోడ్ లో ఈ సీన్ హైలెట్
ఆపవే నీ నాటకాలు.. నువ్వు మాయావని మాకు తెలుసు.. ప్రతినెల మా మావయ్యగారి దగ్గర పది లక్షలు తీసుకుంటున్నావని.. అయినా నీకు డబ్బే కావాలి.. బిడ్డ అవసరం లేదు కదా.. ఇది చాలా? లేక ఇంకా పూర్తిగా చెప్పమంటావా? ఇప్పుడు చెప్పవే నిజం .. డబ్బు కోసం బిడ్డను వదులుకుంటున్నావ్.. అసలు నీకు మా మావయ్యగారికి ఎలాంటి సంబంధం ఉంది.. మర్యాదగా నిజం చెప్పు అని కావ్య అంటుంది.
మీరు ‘నన్నేం అడగొద్దు.. నేను తప్పు చేయలేదు .. నేను ఒప్పుకోను’ అని మాయ అంటుంది. దీనితో ఈ చెత్త పంచాయితీ ఏంటక్కా.. పొడిచేయమంటావా? లేదా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్దామా ’ అని అప్పూ కోపంగా అంటుంది.
దాన్ని పొడిచి నువ్వు ఎందుకు హంతకురాలివి అవ్వడం.. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తే నిజలన్నీ అవే బయటకు వస్తాయి. ‘ఆగండి ఆగండి.. నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకండి.. మీకు ఏ వివరాలు కావాలో చెప్పండి.. నేను మీకు చెబుతాను.. నేను కేవలం డబ్బు కోసమే ఇలా చేస్తున్నాను.. ఆ బిడ్డకు మీ మావయ్యగారికి ఎలాంటి సంబంధం లేదు. ఒక్కసారి తప్పు చేశాం.. దాన్ని అడ్డం పెట్టుకుని.. ఈ నాటకాన్ని మొదలు పెట్టాను.. అతని దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కదా.. అడిగినంత డబ్బు ఇస్తారని ఇలా బెదిరించాను.. అంతే..’ అని మాయ అంటుంది.