Brahmamudi serial: హబ్బా.. ఏం అందం అంటూ.. కావ్యని హాగ్ చేసుకున్న రాజ్
బ్రహ్మముడి సీరియల్లో ఈ సీను హైలెట్
దిశ,వెబ్ డెస్క్: బ్రహ్మముడి సీరియల్లో ఈ సీను హైలెట్
ఇక ఉదయాన్నే కావ్య తల స్నానం చేసి.. వచ్చేసరికి రాజ్ మంచి నిద్రలో ఉంటాడు. అది చూసి.. కావ్య.. దగ్గరకు వెళ్లి.. ఓ సెల్ఫీ తీసుకుంటుంది. తన హెయిర్ రాజ్‌కి తగిలి లేవబోతుంటే.. కావ్య ఏమి తెలియనట్టు ముందుకు పరుగుతీసి.. టవల్‌తో తల తుడుచుకుంటూ ఉంటుంది. అయితే కావ్య వెనక్కి తిరిగి ఉండటంతో.. రాజ్ లేవగానే.. రాజ్‌లోని అంత:రాత్మ రోమియో బయటకి వచ్చి.. ‘అబ్బా ఏం అందం? ఏముంది?’ అంటూ కావ్యని బాగా పొగుడుతుంటాడు.. నేను ఒక్కసారి హగ్ చేసుకుంటాను అని రాజ్‌తో అంటాడు.
‘హేయ్.. అలాంటి పని మాత్రం చేయకు.. అది నా పెళ్లాం.. అలాంటి ఆలోచనలు మనసులో ఉంటె వెంటనే తీసేయ్ అంటాడు. రాజ్ తన అంత:రాత్మ రోమియోతో. అయినా రోమియో వినకుండా కావ్య వైపు పరుగుతీయడంతో.. వాడ్ని ఆపడానికి.. పరుగున వెళ్లి.. రాజ్ కావ్య మీద పడతాడు వెనుక నుంచి కౌగిలించుకున్నట్లుగా. ఇక ఇక్కడ రొమాంటిక్ సీన్ మొదలవుతుంది. కావ్య మనసు జిల్లు మంటుంది. తల స్నానం చేసి ఉండటంతో రాజ్.. ఆ సువాసనను ఆస్వాదిస్తూ.. అలానే ఉండిపోతాడు. ఇంతలో ధాన్యలక్ష్మి గుమ్మం దగ్గరకు వచ్చేసి.. కావ్య అని పిలవడంతో తుల్లిపడతారు భార్యభర్తలు. రాజ్ తుర్రుమంటూ గోడ పక్కకు వెళ్లి.. ‘అయ్యో.. ఛా..’ నేనేనా ఇలా చేసిందంటూ తల బద్దలు కొట్టుకుంటాడు.