'Boycott Rashmika Mandanna'.. రిషబ్‌శెట్టి ఫ్యాన్స్ ట్రోలింగ్
స్టార్ నటి రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం 'గుడ్ బై' ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది..
దిశ, సినిమా: స్టార్ నటి రష్మిక మందన్న నటించిన తాజా చిత్రం 'గుడ్ బై' ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. అయితే ఈ సినిమాను ప్రమోట్ చేస్తూ నెట్టింట ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేసిన నటి.. 'మీరు ఇంకా మీ ఫ్యామిలీతో కలిసి 'గుడ్ బై' మూవీ చూడలేదా. అయితే ఇప్పుడే చూడండి' అంటూ రాసుకొచ్చింది. కానీ, ఈ చిత్రాన్ని మేము చూడలేమంటూ నేటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. 'గుడ్ బై' మూవీకంటే 'కాంతార' బెటర్ అని చెబుతున్నారు. అసలు విషయం ఏమిటంటే.. కన్నడలో ఈ ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'కాంతార' సినిమాను చూడలేదంటూ ఇటీవలే రష్మిక మందన్న వ్యాఖ్యానించింది. అంతేకాకుండా ఓ ఇంటర్వ్యూలో తనను హీరోయిన్గా పరిచయం చేసిన కన్నడ నిర్మాణ సంస్థ పేరును పలకడానికి కూడా ఆమె ఇష్టపడలేదు. దీంతో రిషబ్‌శెట్టి ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. తన 'గుడ్ బై' మూవీని టార్గెట్ చేస్తున్నారు. 'నీ సినిమా మేము చూడాలనుకోవడం లేదు. 'బాయ్‌కాట్' రష్మిక మందన్న. నీ ఫస్ట్ ప్రొడక్షన్ ఏదో గుర్తుందా?' అంటూ విమర్శలు చేస్తున్నారు.
Also Read: బాల చిత్రం నుంచి తప్పుకున్న సూర్య