ఆ నొప్పితో బాధపడుతూనే సినిమా పూర్తిచేశాడు: షారుఖ్‌పై బోస్కో ప్రశంసలు
స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పనితీరుపై ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించాడు
దిశ, సినిమా : స్టార్ హీరో షారుఖ్ ఖాన్ పనితీరుపై ప్రముఖ కొరియోగ్రాఫర్ బోస్కో మార్టిస్ ప్రశంసలు కురిపించాడు. చాలా గ్యాప్ తర్వాత 'పఠాన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకోస్తున్న షారుఖ్.. వయసు పెరుగుతున్నప్పటికీ కష్టపడిపనిచేయడంలో వెనకాడట్లేదని చెప్పాడు. తాజాగా ఓ సమావేశంలో పాల్గొన్న బోస్కో.. ''పఠాన్' మూవీలో 'ఝూమ్ జో పఠాన్' పాటను చీత్రీకరిస్తున్నపుడు షారుఖ్ మోకాలీ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో రిస్క్ తీసుకోవాడానికి నేను ఇష్టపడలేదు. అయినప్పటికీ షూటింగ్ ప్యాక్ అప్ తర్వాత కూడా రాత్రి 2గంటలకు రిహార్సల్స్ కోసం నా దగ్గరకు వచ్చేవాడు. ఒకవైపు నొప్పితో బాధపడుతూనే మంచి అవుట్‌పుట్ కోసం ఆరాటపడ్డాడు. ఆందోళన వద్దని, టైమ్ తీసుకుని షూటింగ్ చేద్దామని టీమ్ అంతా చెప్పినా వినకుండా పనిని కొనసాగించాలన్నాడు. పని విషయంలో రాజీ పడని ఆయన నిబద్ధతకు మేమంతా ఫిదా అయ్యాం' అంటూ వివరించాడు. ఇక 'పఠాన్' జనవరి 25న విడుదలకానుంది.
READ MORE