మహేష్, రాజమౌళి మూవీ‌లో విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో?

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2023-06-09 09:44 GMT

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యాక రాజమౌళితో ‘SSMB 29’ తీయబోతున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్‌తో హాలీవుడ్‌లో కూడా పాపులారిటీనికి దక్కించుకున్న జక్కన్న, మహేష్ బాబు సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా, ఈ సినిమాకు విలన్‌గా ఓ స్టార్ హీరో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతనెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పవర్‌ఫుల్ విలన్‌గా కనిపించనున్నట్లు సమచారం. ప్రస్తుతం మహేష్ బాబు వరుస సినిమా షూటింగ్స్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఖాలీ సమయంలో ఫ్యామిలీతో వెకేషన్స్‌కు వెల్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

Read More...   ఆదిపురుష్ సినిమాలో హనుమంతుడి రోల్ రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో.. ఎవరంటే..?  

ఫైనల్లీ పెళ్లి పీటలు ఎక్కిన నిత్యామీనన్.. వరుడు ఎవరంటే..!

Tags:    

Similar News