బాలీవుడ్ స్టార్ నటుడు ఇంట్లో భార్యకు వేధింపులు..?

సినీ ఇండస్ట్రీలో నటుల వ్యక్తి గత జీవితానికి సంబంధించిన విషయాలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

Update: 2023-01-28 05:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో నటుల వ్యక్తి గత జీవితానికి సంబంధించిన విషయాలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లో క్రేజీ నటుడిగా పేరు తెచ్చుకున్న నవాజుద్దీన్ సిద్దిఖీకి సంబంధించిన ఓ న్యూస్ ప్రస్తుతం వివాదాలకు దారి తీస్తోంది.

బాలీవుడ్‌లో ఎలాంటి పాత్రలో అయినా సరే తనదైన స్టైల్లో దూసుకుపోయే విలక్షణ నటుడు నవాజుద్దీన్. ఇంతటి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న నవాజుద్దీన్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం వివాదాలు ఎదుర్కొంటున్నారు. నవాజుద్దీన్ భార్య అలియా తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం అలియాకి, నవాజుద్దీన్ తల్లికి మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆమెను బెడ్ రూమ్‌లో పడుకోనివ్వడం లేదని.. దీంతో ఆమె సోపాలో పడుకోవాల్సి వస్తుందని తెలిపింది. తిండి పెట్టకుండా.. కనీసం వంటగదిలోకి కూడా రానివ్వకుండా చేస్తున్నారని అలియా ఆరోపించింది. ఆన్లైన్ ఫుడ్ ఏజెంట్స్‌ని కూడా లోపలికి అనుమతించడంలేదని చెబుతుంది. అయితే పోలీసులను కూడా కలవనివ్వక పోవడంతో తన లాయర్‌ ద్వారా సమాచారం చేరవేస్తున్నట్లు అలియా తెలిపింది. కాగా.. గతంలో కూడా వీరు విడాకులకు సిద్ధపడినా.. ఆ తర్వాత అలియా నిర్ణయం మార్చుకోవడంతో తిరిగి భర్తతో కలిసి ఉంటుంది. ఈ క్రమంలోనే నవాజుద్దీన్ తల్లికి, అలియా మధ్య ఆస్తి గొడవలు మొదలయ్యాయి. అయితే ఈ వివాదంపై నవాజుద్దీన్ ఇంకా స్పందించలేదు.

Also Read...

Unstoppable With NBK S2: NBK X PSPK Part 1 PROMO 

Sara Tendulkar : లండన్ థియేటర్లో సచిన్ కూతురు రచ్చ.. పిక్స్ వైరల్

Tags:    

Similar News