Ruhani Sharma: సోషల్ మీడియాలో బోల్డ్ వీడియో వైరల్.. ఎమోషనల్ నోట్ పెట్టిన రుహానీ శర్మ
యంగ్ బ్యూటీ రుహానీ శర్మ సుశాంత్ చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: యంగ్ బ్యూటీ రుహానీ శర్మ సుశాంత్ చిలసౌ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత శ్రీరంగ నీతులు, బ్లాక్ అవుట్,సైంధవ్ వంటి చిత్రాల్లో నటించి మెప్పించడంతో పాటు మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ అమ్మడు స్టార్ క్రికెటర్ కోహ్లీ మరదలు అని తెలియడంతో అమ్మడుకి మరింత పాపులారిటీ వచ్చింది. అయితే గత కొద్ది రోజుల నుంచి రుహానీ శర్మ నటించిన ఆగ్రా సినిమాకు సంబంధించిన బోల్డ్ సీన్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎంతో మంది దారుణంగా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేస్తున్నారు.
ఈ క్రమంలో..తాజాగా, ఈ బ్యూటీ బోల్డ్ వీడియోపై స్పందిస్తూ ఎమోషనల్ నోట్ షేర్ చేసింది. ‘‘అందరికీ హాయ్. నేను నటించిన ఆగ్రా సినిమాకు సంబంధించిన సీన్స్ కొన్ని లీక్ అయ్యాయి. అయితే నెలల తరబడి మేము పడ్డ కష్టం అంతా వృధా అవుతుందనుకోలేదు. అప్పటి నుండి నేను నిరుత్సాహంగా ఉన్నాను. అలా జరగడం వల్ల అసంతృప్తికి గురయ్యా. ఆర్ట్ ఫిల్మ్ తీయడం కష్టం. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ చేశాము. అవన్నీ గుర్తించకుండా కొందరు నా గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే.. అలాంటి ప్రాజెక్ట్‌కు జీవం పోయడానికి రక్తం, చెమట, కన్నీళ్లను లెక్కచేయకుండా చేశాము. అయినా అవన్నీ గుర్తించకుండా కొందరు నన్ను జడ్జ్ చేయడం నిజంగా దారుణం అనిపిస్తుంది.
ఆగ్రా కేవలం చిత్రం కాదు. ఇది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో ప్రదర్శించిన ఒక లేబర్ ఆఫ్ లవ్. ఈ చిత్రం అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడంతో పాటుగా అనేక అవార్డులు గెలుచుకుంది. ఇంత జరిగినా నేను నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఫిల్మ్ మేకింగ్ గురించి మీకేం తెలియకపోతే ఏది పడితే అది అనొద్దు. కాస్త గౌరవం ఇచ్చి మాట్లాడటం మంచిది. అవసరమైతే ప్రోత్సాహించండి కానీ మేము పడిన శ్రమను తక్కువ చేసి చూడకండి. మీ మద్దతు, అవగాహనకు ధన్యవాదాలు. అందరం కలిసి, ప్రేమ, గౌరవంతో ఈ సృజనాత్మక ప్రయాణాన్ని కొనసాగిద్దాం. లవ్ రుహీనీ శర్మ’’ అని రాసుకొచ్చింది. ప్రజెంట్ అమ్మడు పోస్ట్ చూసిన వారు ఆమెకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు.
(Credits to Ruhani sharma Instagram Channel)