తెలుగు హీరోయిన్‌కి బీజేపీ టికెట్.. పోటీ ఎక్కడి నుంచి అంటే?
సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో సీనియర్ నాయకులు ఎవరికైతే మంచి ప్రజాదరణ ఉందో, ఎవరు గెలవగలరో వారిని గుర్తించి టికెట్స్ కేటాయిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సినీతారల పేర్లు
దిశ, సినిమా : సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. దీంతో సీనియర్ నాయకులు ఎవరికైతే మంచి ప్రజాదరణ ఉందో, ఎవరు గెలవగలరో వారిని గుర్తించి టికెట్స్ కేటాయిస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో సినీతారల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి.ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ ప్రముఖ సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్, కంగనా రనౌత్‌కు బీజేపీ టికెట్లు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరో నటికి బీజేపీ టికెట్ లభించింది.ఆమె ఎవరో కాదు నవనీత్ కౌర్ రాణా, ఈమె తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు సంపాదించుకుంది.
అమరావతి (మహారాష్ట్ర) నుంచి సిట్టింగ్ స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణాకు బీజేపీ టికెట్ ఇచ్చింది. ఈ నటి 2019లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించింది. ఇక ఈ నవనీత్ తెలుగు చిత్ర పరిశ్రమలో శీను వాసంతి లక్ష్మీ, మహారథి, యమదొంగ, మూమ్ మెంట్స్, జాబిలమ్మ వంటి తదితర చిత్రాల్లో నటించి, తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.