శివరాజ్ కుమార్ సినిమాలను నిషేధించండి.. ఎన్నికల సంఘానికి BJP రిక్వెస్ట్
లోక్‌సభ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా 370 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దేశ వ్యాప్తంగా 370 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్తంగా గెలుపు గుర్రాలను బరిలోకి దింపింది. ఇదిలా ఉండగా.. ఎన్నికల వేళ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్‌కు బీజేపీ అధిష్టానం షాకిచ్చింది. శివరాజ్ కుమార్ సినిమాలు, ప్రకనటలు, హోర్డింగ్‌లపై నిషేధం విధించాలని కర్ణాటక ఎన్నికల కమిషన్‌ను బీజేపీ ఆశ్రయించింది. శివరాజ్ కుమార్ సతీమణి గీత కర్ణాటకలోని శివమొగ్గ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో ఎన్నికలు ముగిసే వరకు ఆయన సినిమాలు, ప్రకనటలను ప్రసారం చేయకుండా థియేటర్లు, టీవీ ఛానల్స్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లను ఆదేశించాలని కోరింది. బీజేపీ రిక్వెస్ట్‌పై స్పందించిన ఎన్నికల సంఘం.. వినతిని పరిశీలిస్తున్నామని పేర్కొన్నది.