Shobha Shetty : చాలా సార్లు మోసపోయానంటూ ఎమోషనల్ కామెంట్స్

బుల్లితెర నటి శోభాశెట్టి మొదట పలు టీవీ సిరీయల్స్‌లో విలన్‌గా నటించి మెప్పించింది. అలాగే సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది.

Update: 2024-01-25 09:25 GMT

దిశ, సినిమా: బుల్లితెర నటి శోభాశెట్టి మొదట పలు టీవీ సిరీయల్స్‌లో విలన్‌గా నటించి మెప్పించింది. అలాగే సినిమాల్లోనూ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది. అలాగే షోస్ లో పాల్గొంటూ ప్రేక్షకులను అలరించింది. ఇటీవల వచ్చిన బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి వారం నుంచి చివరి వరకు టాస్క్ లో మగాళ్లకు గట్టి పోటీ ఇచ్చింది. అంతేకాకుండా డేరింగ్ అండ్ డ్యాషింగ్ గర్ల్‌గా బయట ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇంట్లో ఉండగానే తన బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసి అందరికీ షాకిచ్చింది. కార్తీక దీపం సీరియల్‌లో డాక్టర్ బాబు తమ్ముడిగా నటించిన యశ్వంత్ రెడ్డితో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది.

ఇంకా ఎందుకు ఆమెను ఇంట్లో ఉంచుతున్నారని పలు పోస్టులు కూడా పెట్టారు. ఆ తర్వాత ఈ అమ్మడుపై చాలా మంది సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేశారు. శోభాశెట్టికి ఓట్లు కూడా పడకపోవడంతో ఇంటి నుంచి ఎలిమినేట్ బయటకు వచ్చేసింది. షో నుంచి బయటకు వచ్చాక పూర్తి సమయాన్ని తన బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్‌తో గడుపుతుంది. అలాగే ఇటీవల ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, శోభాశెట్టి ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన కల నెరవేరినట్లు తెలుపుతూ ఎమోషనల్ అయింది. ‘‘ రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ చూశాం. నచ్చడంతో అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చాం. కానీ ఏవో కారణాల వల్ల ఆ భవన నిర్మాణం ఆగిపోయింది. దీంతో మేమిచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు. అలా చాలాసార్లు మోసపోయాం.

ఈ క్రమంలో ఈ ఇల్లు కూడా కొంటానా? లేదా అని టెన్షన్‌పడ్డాను. కానీ మొత్తానికి నా కల నెరవేరింది. కానీ ఈ ఇల్లు బిగ్‌బాస్ ఇచ్చిన డబ్బుతో కొనలేదు. రెండేళ్ల క్రితం కొన్నాం. కానీ ఇన్ని రోజులకు నా చేతికి తాళం వచ్చింది. ఇంటీరియర్ డిజైనింగ్ పూర్తి కావడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. కాబట్టి అది పూర్తి అయిన తర్వాత మంచి రోజు చూసుకొని ఈ ఇంటికి షిఫ్ట్ అవుదామని అనుకుంటున్నాము’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం శోభాశెట్టి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Tags:    

Similar News