Bigg Boss-7: హౌస్‌లోకి నటి సురేఖవాణి కూతురు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఫిక్స్..!

బుల్లితెరపై ప్రసారమయ్యే ‘బిగ్‌బాస్’ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

Update: 2023-09-16 09:06 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రసారమయ్యే ‘బిగ్‌బాస్’ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ షో ఇప్పటికే ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇటీవల సీజన్ 7 ప్రారంభం అయి రెండు వారాలు అవుతుంది. ఇక ఉల్టా పుల్టా అంటూ బిగ్ బాస్ షోను స్టార్ట్ చేసిన నాగార్జున అందుకు తగ్గట్లుగానే షోను ఆసక్తికరంగా నడిపిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా టాస్కులు పెడుతూ బిగ్‌బాస్ జనాల్లో ఆసక్తిని పెంచుతున్నాడు. ఇందులో 14 కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వగా మొదటి వారం కిరణ్ రాధోడ్ ఎలిమినేట్ అయింది. ప్రస్తుతం 13 మంది మాత్రమే హౌస్‌లో ఉన్నారు.

తాజాగా, ఈ వారం డబుల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందని సమాచారం. ప్రముఖ సీరియల్ హీరో అంబటి అర్జున్, ఇక రెండో కెంటెస్టెంట్‌గా నటి సురేఖ వాణి కూతురు సుప్రిత ఎంపికైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ అమ్మడు బిగ్‌బాస్‌లో అడుగుపెడితే ఎన్ని లవ్ ట్రాక్‌లు మొదలవుతాయోనని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.

Tags:    

Similar News