Sudigali Sudheer : క్యూ కడుతున్న బడా నిర్మాతలు

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ముందుకు సాగడం చాలా కష్టం.

Update: 2022-12-07 11:34 GMT

దిశ, సినిమా: సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా ముందుకు సాగడం చాలా కష్టం. స్టార్ డమ్ సంపాదించుకోవాలంటే కచ్చితంగా లక్, టాలెంట్ ఉండాలి. ఈ రెండు విషయాల్లో సమానంగా ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీలో ఉండగలరు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా ఇదే దారిలో వెళ్తున్నారు. ఈటీవీలో జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నా నటుడు.. టీం లీడర్ అయిన తర్వాత ఓ రేంజ్‌కి ఎదిగాడు. అలాగే ప్రముఖ చిత్రల్లో స్టార్ హీరోలకు ఫ్రెండ్ క్యారెక్టర్‌లు చేస్తు కామెడీ పండించాడు. రీసెంట్‌గా 'గాలోడు' చిత్రంతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి చిత్రంతోనే బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాడు. అ మూవీ సుధీర్ మూలంగా మంచి హిట్ అయ్యింది. ఎందుకంటే తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ అలాంటిది. ఇక ఇప్పుడు సుధీర్‌తో సినిమా తీయడం కోసం బడా నిర్మాతలు క్యూ కడుతున్నారు. దిల్ రాజు, అల్లు అరవింద్ అతనికి అడ్వాన్స్ ఇచ్చి డేట్‌లు లాక్ చేసుకుంటున్నారు. దీంతో సుధీర్ దశ తిరిగినట్లే అనిపిస్తుంది.

Read more:

మద్యం మత్తులో కారు డ్రైవర్‌ను మరిచిపోయిన Janhvi Kapoor

Tags:    

Similar News