సంచనల నిర్ణయం తీసుకున్న బిచ్చగాడు హీరో విజయ్ ఆంటోని
ఈ ఈవెంట్లో హీరో విజయ్ ఆంటోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు
దిశ, సినిమా: కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిచ్చగాడు వంటి బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలతో తమిళంతో పాటు తెలుగులోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా, గాయకుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. బిచ్చగాడు హిట్ తర్వాత విజయ్ ఆంటోని నటించిన సినిమాలన్నీ తెలుగులో విడుదల కానున్నాయి. ఇటీవల విడుదలైన బిచ్చగాడు 2, ప్రేమగురువు చిత్రాలు విజయవంతమయ్యాయి.
విజయ్ ఆంటోని ప్రస్తుతం 'తుఫాన్' మూవీలో కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి.లలితా, ప్రదీప్, పంకజ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి కూడా విజయ్ మిల్టన్ దర్శకుడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా టీజర్ విడుదల కార్యక్రమాన్ని చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో హీరో విజయ్ ఆంటోనీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అదేంటో ఇక్కడ చూద్దాం..
దీనిపై విజయ్ ఆంటోనిని ప్రశ్నించగా షాకింగ్ ఆన్సర్ చెప్పాడు. “కొన్ని రోజుల క్రితం నేను చెప్పులు లేకుండా నడుస్తున్నాను. అప్పుడు, నాకు మంచిగా అనిపించింది. ఇది ఆరోగ్యానికి కూడా మంచిది. ఇది మన ఆత్మవిశ్వాసాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నేను చెప్పులు లేకుండా నడవడం ప్రారంభించినప్పటి నుండి, ఆ సమయంలో ఎలాంటి ఒత్తిడికి గురవ్వలేదు. జీవితాంతం చెప్పులు లేకుండా ఉండాలనుకుంటున్నాను" అతను చెప్పుకొచ్చాడు. విజయ్ ఆంటోని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.