ఆ పోర్న్ వీడియో నాది కాదు.. స్పష్టం చేసిన ప్రియాంక
భోజ్ పూరి నటి ప్రియాంక పండిట్ పోర్న్ వీడియో లీక్ ఇష్యూపై స్పందించింది.
దిశ, సినిమా : భోజ్ పూరి నటి ప్రియాంక పండిట్ పోర్న్ వీడియో లీక్ ఇష్యూపై స్పందించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బ్యూటీ.. ప్రతి రోజూ గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. అయితే ఈ చిన్నదానికి సంబంధించిన ఓ ప్రైవేట్ వీడియో గతేడాది సోషల్ మీడియాలో దర్శనమివ్వగా ఆమె పేరు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కాగా తాజాగా ఆ వీడియోను ఉద్దేశిస్తూ ఓ సమావేశంలో మాట్లాడిన ప్రియాంక.. 'అందులో ఉన్నది నేను కాదు. కావాలనే నన్ను టార్గెట్ చేసి మార్ఫింగ్ వీడియోలు, ఫొటోలు నెట్టింట పోస్ట్ చేస్తున్నారు. అలాంటి వాటివల్ల నా కెరీర్ నాశనం అయింది. నన్ను పూర్తిగా ఇండస్ట్రీ పోటీ నుంచి తప్పించాలని చూస్తున్నారు. అందుకే నాపై విష ప్రచారం చేస్తున్నారు' అంటూ వాపోయింది.