ముఖ్యమంత్రి కావడం చాలా ఈజీ.. వైరల్ అవుతున్న రామ్ ‘స్కంద’ డైలాగ్ (వీడియో)

మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం స్కంద. గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది.

Update: 2023-09-30 05:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను, ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం స్కంద. గత గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. తొలి రోజే భారీ స్థాయిలో కలెక్షన్లు రాబట్టి.. రామ్ కెరీర్‌లోనే హైయ్యెస్ట్ డే1 గ్రాసర్‌గా రికార్డు సృష్టించింది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

‘ముఖ్యమంత్రి పదవిలో దమ్ము ఉంది. ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఉండవు. పుట్టినరోజు వస్తే రాష్ట్రం మొత్తం ఫ్లెక్సీలు పెడతారు. మన పేరుమీద ఫ్రీగా అన్నదానాలు చేస్తారు. రక్తదానాలు చేస్తారు. ఓటు కోసం జస్ట్ తియ్యాలే, పొయ్యాలే, గట్టిగా అరిస్తే తొయ్యాలే, అడ్డం వస్తే లేపాలే’ అనే డైలాగ్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది. దీనిని రాజకీయ నాయకులకు ట్యాగ్ చేస్తూ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాదు.. బోయపాటి ఎవరిని ఉద్దేశించి ఈ డైలాగ్స్ రాశాడో అందరికీ తెలుసని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ సినిమాలో రామ్ సరసన శ్రీలీల నటించడగా, శ్రీనివాస్ చిత్తూరి నిర్మించారు.

Tags:    

Similar News