Kangana Ranaut: సినిమాల పరంగా బిజీగా ఉండటం వల్ల ఒత్తిడి పెరిగింది.. కంగనా రనౌత్‌ ఆసక్తికర కామెంట్స్

కథానాయికగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్నారు కంగనా రనౌత్‌. అయితే ఇటీవల ఆమె లోక్‌సభ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు.

Update: 2024-08-13 14:13 GMT

దిశ, సినిమా: కథానాయికగా బాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్నారు కంగనా రనౌత్‌. అయితే ఇటీవల ఆమె లోక్‌సభ సభ్యురాలిగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఒకవైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న ఆమె రాజకీయా ప్రభావం నటిగా తన కెరీర్‌పై ప్రభావం చూపుతోందని అంటున్నారు. కంగనా స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎమర్జెన్సీ'. పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు సెప్టెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 'ఎంపీగా ఉంటడం నిజంగా ఒక సవాల్‌తో కూడిన అంశం. ఎంపీగా ఎన్నికైన తర్వాత నా బాధ్యతలు పెరిగాయి. అటు రాజకీయంగా, ఇటు సినిమాల పరంగా బిజీగా ఉండటం వల్ల ఒత్తిడి పెరిగింది. ఇది నా సినీ జీవితం పై ప్రభావం చూపుతోంది. రాజకీయాలకు ఎక్కువ టైమ్‌ కేటాయించడం వల్ల ఆ ప్రభావం నా తదుపరి సినిమాలపై పడుతుంది' అన్నారు.

Tags:    

Similar News