Meenakshi Chaudhary : ఆ కారణంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా వదిలేసుకున్న
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి.
దిశ, సినిమా: ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ మూవీ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి చౌదరి. ఆ తర్వాత ‘ఖిలాడి’ గా మాస్ మహారాజ రవితేజ సరసన నటించి, ‘ హిట్ 2 ’ మూవీ తో మంచి హిట్ అందుకుంది. ఇక రీసెంట్ గా ‘గుంటూరు కారం’ లో సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ ని సోంతం చేసుకుంది మీనాక్షి. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ చిన్నది తన కెరీర్ గురించి కొన్ని విషయాలు పంచుకుంది.. ‘మహేశ్‌బాబుతో నటించే అవకాశం వచ్చిందని తెలియగానే నా ఆనందానికి అవధులులేవు. మొదటిరోజు మొదటి షాట్ కూడా ఆయనతోనే..! చాలా టెన్షన్ పడ్డాను. నా భయాన్ని గమనించి.. టెన్షన్ పడొద్దనీ, కావాలంటే ఇంకొంత టైమ్ తీసుకోమని ధైర్యం చెప్పారు మహేశ్. ఆ మాటలే నాలో భయాన్ని పోగొట్టి ఎంతో ధైర్యం ఇచ్చాయి.
కానీ నా కోసం నేను కొన్ని నియమాలు పెట్టుకున్నా. అందులో ప్రధానమైంది.. నా కంఫర్ట్. స్క్రిప్ట్ ఏమాత్రం అసౌకర్యంగా అనిపించినా.. ముందే నో చెప్పేస్తా. అలా ఇప్పటికి నేను పెద్ద పెద్ద ప్రాజెక్టులను కూడా వదిలేసుకున్నాను. తెరపై ముద్దులకు సంబంధించి కూడా.. కొన్ని నియమాలు పాటిస్తా. ఇక స్క్రిప్ట్ డిమాండ్ చేసి, మరీ అసభ్యకరంగా లేకుంటే.. నాకు ఓకే కానీ, కేవలం ముద్దు సీన్ల కోసమే అంటే వద్దని చెబుతాను. భాష ఏదైనా మంచి సినిమాలు చేయాలని నా కోరిక. డబ్బు కంటే ముఖ్యంగా.. నేను చేసే పనికి ప్రశంసలతో పాటు గౌరవం దక్కాలి. అందుకోసమే ఆచితూచి ఎంచుకుంటున్న.. అలా అని కేవలం ఇలాంటి సినిమాలే చేయాలని గిరి గీసుకొని కూర్చోలేదు. అన్ని రకాల పాత్రలు చేయడానికి సిద్ధంగా ఉన్నా’ అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.