నో కండిషన్స్.. ఓన్లీ కమిట్ మెంట్: Salman Khanకు తోడు కావాలంటున్న నటి
స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ, పెళ్లిపై ప్రముఖ నటి-జ్యోతిష్యురాలు బెబికా ధూర్వే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ OTT 2లో కంటెస్టెంట్గా ఉన్న నటి.. ఓ టాస్క్ సందర్భంగా సల్మాన్ పర్సనల్
దిశ, సినిమా: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ, పెళ్లిపై ప్రముఖ నటి-జ్యోతిష్యురాలు బెబికా ధూర్వే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్’ OTT 2లో కంటెస్టెంట్గా ఉన్న నటి.. ఓ టాస్క్ సందర్భంగా సల్మాన్ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడింది. ఈ మేరకు చాలామంది అమ్మాయిలు ప్రేమ పేరుతో సల్మాన్ను మోసం చేశారని, ప్రస్తుతం ఆయనకు మంచి హౌస్ వైఫ్ కావాలని చెప్పింది. ‘సల్మాన్ ఖాన్ నిజంగానే ప్రేమలో మోసపోయారు. ఇప్పుడు ఆయనకు హోమ్లీ వైఫ్ చాలా అవసరం. ఆయన తల్లిదండ్రులకు సేవ చేయడానికి అంకితభావం కలిగిన ఒక గృహిణి కావాలని అతను కోరుకుంటున్నాడు. అత్యంత ప్రతిభావంతురాలు, అనేక ప్రత్యేకతలు కలిగిన అమ్మాయి ఆయనకు అక్కర్లేదు’ అంటూ తన మనసులో మాట బయటపెట్టింది.