Bandla Ganesh: పూరీ జగన్నాథ్ భార్యపై బండ్ల గణేశ్ సెన్సేషనల్ కామెంట్స్
Bandla Ganesh Controversial Comments On Puri Jagannadh| టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ కమెడీయన్ బండ్ల గణేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఫంక్షన్ అయినా, రాజకీయ సమావేశం అయినా ఆయన స్పీచ్ కోసం
దిశ, వెబ్‌డెస్క్: Bandla Ganesh Controversial Comments On Puri Jagannadh| టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, స్టార్ కమెడీయన్ బండ్ల గణేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా ఫంక్షన్ అయినా, రాజకీయ సమావేశం అయినా ఆయన స్పీచ్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ ప్రత్యేకంగా ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా మూవీ ఫంక్షన్ అయితే 'బండ్లన్న.. బండ్లన్న' అంటూ అరుపులు కేకలతో హోరెత్తిస్తుంటారు. కొన్ని సార్లు బండ్ల గణేష్ స్పీచులు ఆ ఫంక్షన్‌కే హైలెట్‌గా నిలుస్తుండగా.. మరికొన్ని సార్లు బండ్లన్న మాటలు వివాదాస్పదమవుతుంటాయి. తాజాగా.. అలాంటి ఘటనే మళ్లీ చోటుచేసుకుంది. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ హీరోగా నటించిన 'చోర్ బజార్' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చార్మి, పూరిని ఉద్దేశిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. పూరి దగ్గర చిల్లిగవ్వ కూడా లేని సమయంలో అతనితో పాటు కట్టుబట్టలతో వచ్చిన వ్యక్తి లావణ్య(పూరి జగన్నాథ్ భార్య) అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పూరి సినిమాలకోసం ప్రయత్నం చేస్తున్న సమయంలో లావణ్యతో ప్రేమలో పడ్డాడు. వీరు ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. ఆ సమయంలో పూరి వద్ద చిల్లి గవ్వలేదు. కనీసం ప్రేమించిన అమ్మాయి మెడలో వేసే తాళి కొనడానికి కూడా డబ్బులు లేని సందర్భంలో లావణ్య పూరి జగన్నాథ్‌ను నమ్మి వచ్చిందని, అలాంటి మహోన్నత వ్యక్తికి పూరిజగన్నాథ్ అన్యాయం చేస్తున్నాడు అంటూ బండ్ల గణేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారి పెళ్లి సమయంలో వారి ప్రముఖ యాంకర్ ఝాన్సీ తాళిబొట్టు కొనిచ్చిందని, నటి హేమ వీరికి బట్టలు తీసుకుందని తెలిపారు. పెళ్లి తర్వాతే ఆయన స్టార్ డైరెక్టర్ అయ్యారు. దీనికి కారణం లావణ్యనే అంటూ ఆమెను ఆకాశానికెత్తేశాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.