బొకే ఇచ్చిన అభిమాని.. విసిరేసిన బాలయ్య.. వీడియో వైరల్
నందమూరి బాలకృష్ణ.. అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు.
దిశ వెబ్ డెస్క్: నందమూరి బాలకృష్ణ.. అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు. అసలు ఆ పేరు వినపడితేనే అభిమానుల్లో ఓ వైబ్రేషన్. ఆయన ముందు నకరాలు చేస్తే పీక్స్ కి వెళ్తుంది ఆయన ఫ్రేస్టేషన్. అందుకే బాలయ్య ముందు ఉన్నప్పుడు ఒంట్లో భయముండాలి. మన చూపు ఆయన పైనే ఉండాలి లేదని పిచ్చి చూపులు చూస్తే పిసికి పారేస్తాడు బొకే.. ఇందేంటి బొకే పిసికి పారేస్తాడు అంటుంది అనుకుంటున్నారా. ఈ వీడియో చూస్తే మీరు అదే మాట అంటారు.
ఇంతకీ ఆ వీడియో లో ఏముంది అనుకుంటున్నారా.. ఓ అభిమాని బాల్లయ్య కోసం బొకే తెస్తాడు. తెచ్చిన వ్యక్తి బాలయ్యకి బొకే ఇవ్వకుండా దిక్కులు చూస్తూ బాలయ్యను పరేషాన్ చేస్తాడు. బొకే ఇవ్వడానికి వచ్చి దిక్కులు చూస్తావేంట్రా బేవకూఫ్ అనుకున్న బాలయ్య.. బొకే ఇవ్వకుండా అటెవరున్నారని చూస్తున్నావ్.. అనగానే బొకే ఇస్తాడు అభిమాని. అయితే బాలయ్య ఆ బొకే తీసుకుని విసిరిపారేస్తాడు.ఇదంతా అక్కడ ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియా లో పోస్ట్ చేయగా ఆ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ వీడియో ని మీరు ఒకసారి చూసేయండి.
ఆయనంతే..ఆయన స్టైల్ అంతే pic.twitter.com/lKhjbbVdbj
— Actual India (@ActualIndia) January 9, 2024