లక్ష బడ్జెట్‌తో బాలయ్య మూవీ.. ఎన్ని కోట్లు వసూలు చేసిందో తెలిస్తే షాకే?
ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఏ సినిమా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్లే తప్పా.. ప్లాప్ అనే మాటే ఉండదు.
దిశ, వెబ్‌డెస్క్: ఎన్టీఆర్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ ఏ సినిమా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్లే తప్పా.. ప్లాప్ అనే మాటే ఉండదు. అయితే బాలయ్య తొలిసారి బాలనటుడిగా వెండితెరపై కనిపించిన చిత్రం ‘‘తాతమ్మ కల’’ ఈ సినిమాలో ఆయన ‘భానుమతి’ లాంటి లెజండరీ ఆర్టిస్టుతో కలిసి నటించాడు. మళ్ళీ ఆమె తోనే ‘మంగమ్మ గారి మనవడు’ సినిమాలో నటించి కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌ని అందుకొని స్టార్ హీరోగా పేరు దక్కించుకున్నారు. ఆ రోజుల్లో ఈ మూవీని దర్శకుడు ‘ఎస్ గోపాల్ రెడ్డి’ కేవలం లక్ష రూపాయిల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారట. అప్పటి రోజుల్లో లక్ష రూపాయిలంటే మామూలు విషయం కాదు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక నాలుగు కోట్ల 80 లక్షల రూపాయిల వసూళ్లు రాబట్టిందట. అయితే లక్ష రూపాయిలు ఎక్కడ, నాలుగు కోట్ల 80 లక్షలు ఎక్కడా? అంటూ నెట్టింట కాస్త చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
వరుణ్ ఎంగేజ్మెంట్కు పీకలదాకా తాగొచ్చిన పవన్ కల్యాణ్.. సంచలనం సృష్టిస్తోన్న పోస్ట్