తగ్గేదేలే అంటున్న ‘బలగం’.. ఓటీటీలో వచ్చిన థియేటర్లలో తగ్గని కలెక్షన్లు

దిల్ రాజ్ ప్రొడక్షన్స్‌.. వేణు డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘బలగం’.

Update: 2023-03-29 07:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: దిల్ రాజ్ ప్రొడక్షన్స్‌.. వేణు డైరెక్షన్‌లో తెరకెక్కిన సినిమా ‘బలగం’. చిన్న సినిమాగా రూపుదిద్దుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బిగ్ సక్సెస్ అందుకుంది. తెలంగాణ పల్లే జీవితాన్ని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై నెల రోజులు కావొస్తున్నా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఈ క్రమంలోనే ఓటీటీలో వచ్చినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి సినిమాను ఎంజాయ్ చేస్తున్నారు. రోజుకు సుమారు రూ. 50 లక్షల వరకు వసూళ్లు సాధిస్తోంది. మొత్తం 26 రోజుల్లో ఏపీ, తెలంగాణ కలిపి రూ. 24.74 కోట్లు (గ్రాస్) వచ్చాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా వెళ్లి సినిమా చూసేయండి.

ఇవి కూడా చదవండి: ప్రతి పల్లెను తాకిన బలగం.. ఆ ఊర్లో ఏం చేశారో తెలుసా?

Tags:    

Similar News