సైలెంట్‌గా ఓటీటీకి వచ్చేసిన ‘బాక్ అరణ్మణై 4’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
గత నెలలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన హర్రర్ చిత్రం బాక్ ఆరణ్మణై 4 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది.
దిశ, సినిమా: గత నెలలో చిన్న సినిమాగా విడుదలై సంచలన విజయం సాధించిన హర్రర్ చిత్రం బాక్ ఆరణ్మణై 4 డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. సుందర్.సి మెయిన్ లీడ్‌గా నటిస్తూ దర్శకత్వం, నిర్మాతగా కూడా వ్యవహరించిన ఈ సినిమాలో అగ్ర కథానాయికలు తమన్నా , రాశిఖన్నా ముఖ్య పాత్రల్లో నటించారు. మే 3న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టడమే కాక ఈ ఏడు తమిళ సినిమా హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. తెలుగులో బాక్ గా విడుదలైన ఈ మూవీ ఇక్కడా మంచి స్పందననే రాబట్టుకుంది.
అయితే ఈ సిరీస్‌లో వచ్చిన అరణ్మణై(కళావతి, చంద్రకళ, అంతపురం) మూడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో ఈ నాలుగో చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జేట్‌తో తెరకెక్కించారు. కాగా ఈ సినిమా నేటినుంచి(జూన్ 21) డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. థియేటర్లలో మిస్సయిన వారు, హర్రర్ సినిమాలు ఇష్టమున్నవారు ఈ సినిమా చూడడం అస్సలు మిస్ చేసుకోకండి.