'బాయ్‌కాట్ బాలీవుడ్' ట్రెండ్ ఆందోళనకు గురిచేసింది: Ayushmann Khurrana
విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా 'బాయ్‌కాట్ బాలీవుడ్' కాంట్రవర్సీపై మొదటిసారి స్పందించాడు.
దిశ, సినిమా : విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా 'బాయ్‌కాట్ బాలీవుడ్' కాంట్రవర్సీపై మొదటిసారి స్పందించాడు. అప్‌కమింగ్ మూవీ 'యాన్ యాక్షన్ హీరో' డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుండగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న హీరో.. బాలీవుడ్‌పై బహిష్కరణ సంస్కృతి తనను ఆందోళనకు గురిచేసిందని, కావాలనే ఒక స్టార్‌ను లక్ష్యంగా చేసుకుని ఆన్‌లైన్‌లో ప్రచారం చేయడం ఇండస్ట్రీకే హానికరంగా మారిందన్నాడు.
'సినీ పరిశ్రమలో ఏం జరుగుతుందో నాకు స్పష్టంగా తెలుసు. సెలబ్రిటీలతో ప్రజలు వాదిస్తున్న ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇవ్వగలను. అయితే ప్రతి అంశాన్ని చూడడానికి ఎల్లప్పుడూ రెండు మార్గాలు ఉంటాయి. ఒకటి ప్రతిఫలం పొందటం మరొకటి శిక్షించటం. సరైన కారణం లేకుండా శిక్షించబడటానికి సినిమా లేదా నటులు అర్హులు కాదని నేను భావిస్తున్నా. బాయ్‌కాట్ నినాదం పూర్తిగా తప్పు. మనుషులు, కథలు ఈ రెండు దృక్కోణాలకు మధ్య స్వల్ప వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని బలంగా కోరుకుంటున్నా' అని స్పష్టం చేశాడు.
ALSO READ:టాలీవుడ్ కాదు బాలీవుడ్ నన్ను కాపాడింది: Taapsee Pannu