అసభ్యకరంగా నన్ను తాకాడు.. కానీ నేను ఏం చేయలేకపోయా.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న వారిలో అవికా గోర్ ఒకరు.

Update: 2024-06-18 13:39 GMT

దిశ, సినిమా: బాల నటిగా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం హీరోయిన్‌గా రాణిస్తున్న వారిలో అవికా గోర్ ఒకరు. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌తో ప్రేక్షకుల మనుసులు గెలుచుకున్న ఈమె.. ‘ఉయ్యాల జంపాల’ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో క్లాసికల్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ.. తర్వాత పలు సినిమాల్లో నటించింది. నటన పరంగా పర్వాలేదు అనిపించుకున్న అవిక.. స్టార్‌ఢమ్‌ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఈ బ్యూటీ.. గతంలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి పంచుకుంది.

‘విదేశాల్లో జరిగిన ఓ ఈవెంట్‌కు నేను హాజరయ్యారు. అప్పుడు కారు దిగి లోపలికి వెళ్తుండగా.. నన్ను వెనుక నుంచి ఎవరో టచ్ చేసినట్లు అనిపించింది. వెనక్కి తిరిగి చూడగా బాడీగార్డ్ మాత్రమే ఉన్నాడు. తర్వాత వేదికపైకి వెళ్తునప్పడు కూడా నా వెనుక టచ్ చెయ్యడానికి చూశాడు. వెంటనే చెయ్యి పట్టుకున్నా. నాకు సారీ చెప్పాడు. ఇక ఆ క్షణం నేను ఏమి చెయ్యలేకపోయాను. నాకు అప్పుడు ధైర్యం లేదు. ఉంటే చాలా మందిని కొట్టేదాన్ని. కానీ ఇప్పుడు అలా కాదు. నన్ను ఎవరైన అసభ్యకరంగా తాకలని చూసిన, తాకిన వారిని కొడతా. అప్పటితో పోల్చితే ఇప్పుడు చాలా ధైర్యం వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది.


Similar News