అవతార్-2 సినిమాకు పైరసీ దెబ్బ
హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమరాన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా అవతార్-2.
దిశ, వెబ్‌డెస్క్: హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కెమరాన్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న సినిమా అవతార్-2. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి సినీ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. డిసెంబర్ 16వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అయితే, మరి కొన్ని గంటల్లో ఈ సినిమా విడుదల కానుండగా.. చివరి క్షణంలో ఊహించని షాక్ తగిలింది. రిలీజ్‌కు ఒకరోజు ముందే టెలీగ్రామ్‌లో అవతార్-2 సినిమా ప్రత్యక్షమైంది. దీంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. విజువల్ వండర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను కొన్ని క్షణాలముందు లీక్ చేయడం సరికాదని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.