Ram Charan: గ్లోబల్ స్టార్‌కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిన ఆస్ట్రేలియా ఫ్యాన్స్.. ఏకంగా చరణ్ ఫొన్‌తోనే సెల్ఫీ

సాధారణంగా ఎవరైనా సరే అభిమాన హీరో, హీరోయిన్ కనిపించగానే వారితో మాట్లాడటానికి, ఫొటోలు దిగడానికి ప్రయత్నిస్తుంటారు.

Update: 2024-08-17 03:29 GMT

దిశ, సినిమా: సాధారణంగా ఎవరైనా సరే అభిమాన హీరో, హీరోయిన్ కనిపించగానే వారితో మాట్లాడటానికి, ఫొటోలు దిగడానికి ప్రయత్నిస్తుంటారు. కాగా కొంతమంది సెలబ్రిటీలు ఎలాంటి స్టేటస్ చూపించుకోకుండా దగ్గరకొచ్చి మరీ సెల్ఫీ ఇస్తారు. మరికొంతమంది జనాల్లో ఇబ్బంది పడుతూ ఫాస్ట్‌గా వెళ్తుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో అనేకం చూసే ఉంటారు. అయితే తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు దక్కించుకున్న రామ్ చరణ్‌‌ను కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ హీరో ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. చిరుత, మగధీర, గోవిందుడు అందరివాడేలే, ఆర్ఆర్ఆర్, ధృవ, రంగస్థలం, ఎవడు వంటి చిత్రాల్లో నటించి తండ్రికి తగ్గ తనయుడు అని సినీ ఇండస్ట్రీలో అండ్ దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకున్నాడు.

అయితే గ్లోబల్ స్టార్ నిన్న (ఆగస్టు 16) ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ కు వెళ్లాడు. ఈ క్రమంలో మెల్బోర్న్ ఎయిర్ పోర్ట్ వద్ద చరణ్ కనిపించగానే అక్కడి ఫ్యాన్స్ ఈయనకు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. మన గ్లోబల్ స్టార్‌ను చూడగానే తెగ మురిసిపోయారు. చరణ్ అందరికి హాయ్ చెబుతూ తన ఫొన్‌లోనే ఫ్యాన్స్‌తో సెల్ఫీ తీసుకున్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Click Here for Twitter Link

Tags:    

Similar News