VJ Sunny: బిగ్ బాస్ విన్నర్ వీజే సన్నీపై దాడి.. అభిమానుల ఆందోళన
VJ sunny has been attacked| బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీపై దాడి జరిగింది. ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్‌తో పలు ప్రాజెక్ట్‌లకు సైన్ చేసిన సన్నీ.. ప్రస్తుతం దిల్ రాజు- హరీశ్ శంకర్ నిర్మాణంలో రూపొందుతున్న
దిశ, సినిమా: VJ sunny has been attacked| బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ వీజే సన్నీపై దాడి జరిగింది. ఈ షో ద్వారా వచ్చిన ఫేమ్‌తో పలు ప్రాజెక్ట్‌లకు సైన్ చేసిన సన్నీ.. ప్రస్తుతం దిల్ రాజు- హరీశ్ శంకర్ నిర్మాణంలో రూపొందుతున్న ఏటీఎం వెబ్ సిరీస్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. కాగా ఈ షూటింగ్ లొకేషన్‌లోకి అనుమతి లేకుండానే ఎంటర్ అయిన రౌడీ షీటర్స్.. కావాలనే సన్నీతో గొడవకు దిగారని, దాడి చేసేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. బుధవారం సాయంత్రం జరిగిన సంఘటనలో వివాదం ఎక్కువ కాకముందే చిత్ర యూనిట్ సన్నీని క్షేమంగా అక్కడి నుంచి తరలించినట్లు తెలుస్తోంది. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేయగా.. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.