సమంతపై ట్రోల్స్‌.. నెటిజన్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన చిన్మయి ఆమెను ఆదర్శంగా తీసుకోవాలంటూ పోస్ట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించింది.

Update: 2023-09-03 09:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదలై సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే కొంత మంది నెటిజన్లు సమంత ఖుషి మూవీలో బెడ్ రూమ్ సీన్స్‌లో అంతలా నటించడం అవసరమా అంటూ ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

తాజాగా, దీనిపై సింగర్ చిన్మయి స్పందిస్తూ ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టింది. ‘‘తనని మీరు ఇంతలా నిందిస్తున్నా.. తనకి వచ్చిన ఆటోఇమ్యూనిటీ డిజార్డర్ మీకు కూడా వస్తే ఏంటని ఆలోచించి. దాని పై మీలో అవగాహన కల్పించేందుకు ఒక అడుగు ముందుకు వేసి అందరికీ ధైర్యం నింపడానికి ప్రయత్నిస్తున్న సమంత ను చూసి నేర్చుకోండి. తనను ఎవరు ఎన్ని అంటున్నా అవేవి పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ ముందుకు సాగుతుంది. సమంత పని అయిపోయింది. ఇక ఆమెకు కెరీర్ లేదు అన్న ప్రతి ఒక్కరికీ.. బాలీవుడ్ అండ్ హాలీవుడ్‌లో తన ముద్ర వేసి బదులిచ్చింది.

అలాగే మగజాతి ఆణిముత్యం అని చెప్పుకునే కొంతమంది.. నిజం గమనించలేక కొన్ని రోజుల నుంచి చాలా దరిద్రంగా మాట్లాడుతున్నారు. అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న వారిని దూరంగా పెట్టండి. డబ్బులు సంపాదించాలని ఒకర్ని ఇలా దూషిస్తున్నా, ఏమి మాట్లాడకుండా దూషించే వాళ్లకి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి వారి నుంచి కూడా డబ్బు సందించుకునే శాడిస్టిక్ పొజిషన్ లో సమాజం నేడు ఉంది. అయితే కర్మ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎవరిది వారికి ఎప్పుడో అప్పుడు తిరిగి ఇచ్చేస్తుంది’’ అంటూ పెద్ద నోట్ షేర్ చేసింది.

Tags:    

Similar News