ఆ టైమ్‌లో రామ్ చరణ్ ఇంట్లోనే ఉన్నాను.. ఎవరికీ చెప్పొద్దు అన్నాడు.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నది. ఇక ఇటీవలె యక్షిణి అనే మూవీలో నటించి మెప్పించింది. ఇలా తెలుగులో మూవీస్ చేస్తూనే బాలీవుడ్ మీద కూడా ఫోకస్ పెట్టింది ఈ అమ్మడు. ఈ క్రమంలోనే ఇటీవల ముంబైకి షిఫ్ట్ అయి ఓ అపార్ట్‌మెంట్ కూడా తీసుకుని అక్కడే ఉంటుంది.
ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. అవి ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఆమె మాట్లాడుతూ.. నేను మొదట్లో ముంబైకి షిఫ్ట్ అయినప్పుడు నాకు ఇల్లు కూడా లేదు. అప్పుడు నేను రామ్ చరణ్ ఇంట్లో ఉండేదాన్ని. ఆ విషయం ఎవరికీ తెలియదు. రామ్ చరణ్ కూడా ఎవరికీ చెప్పొద్దు అని చెప్పాడు. ఇప్పుడు నేను అపార్ట్‌మెంట్ తీసుకున్నాక అక్కడినుంచి షిఫ్ట్ అయ్యాను అని తెలిపింది. అదేవిధంగా నేను రానా, చరణ్, ఇలా ఆల్మోస్ట్ 142 మందికి కలిపి మాకు ఓ వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. మా సినిమాలకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇందులో పోస్ట్ చేస్తాం. మేమంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్లమే అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా మంచు-మెగా ఫ్యామిలీ అనుబంధం గురించి తెలిసిందే. ఆ చనువు వల్లే చరణ్ ఇంట్లో మంచు లక్ష్మి ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.