గూస్ బంప్స్ తెప్పించేలా అశ్విన్ బాబు 'శివం భజే' మూవీ టీజర్

‘హిడింబా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అశ్విన్ బాబు హీరో, దిగాంగన సూర్యవంశీ హీరోయిన్‌గా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘శివం భజే’.

Update: 2024-06-20 02:23 GMT

దిశ, సినిమా: ‘హిడింబా’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత అశ్విన్ బాబు హీరో, దిగాంగన సూర్యవంశీ హీరోయిన్‌గా అప్సర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘శివం భజే’. ఇక మహేశ్వర్ రెడ్డి మూలి నిర్మాణంలో గంగా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద తెరకెక్కుతున్నది ఈ సినిమా. అయితే ఇటీవల ఈ చిత్రం ఫస్ట్ లుక్, టైటిల్ అందరి దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ టీజర్ నేడు రిలీజ్ అయి అంచనాలను పెంచేసింది. న్యూ ఏజ్ కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సస్పెన్స్ , యాక్షన్, థ్రిల్ ఎలిమెంట్స్ తో పాటు డివోషన్ కూడా ఉన్నట్టు టీజర్ లో అర్ధమవుతోంది. హీరో అశ్విన్ కి ఏదో మానసిక సమస్య ఉన్నట్లు బ్రహ్మాజీ, హైపర్ ఆదిలతో చెప్పడం, ఇన్వెస్టిగేషన్ లో బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్, మురళీ శర్మ, సాయి ధీనా వంటి పలువురు నటులు నిమగ్నమై ఉండడం, అయ్యప్ప శర్మ ద్వారా వీటన్నిటి వెనుక దైవం ఉనికి ఉందని తెలియజేయడం ఆసక్తికరంగా ఉంది.

ఇక మరోపక్క అశ్విన్ బాబు రౌద్ర రూపంలో రౌడీలను శూలంతో ఎత్తి పడేయడం… అన్నిటినీ మించి చివరగా అదిరిపోయే సీజీ విజువల్స్ లో దాచిన శివుని దర్శనం, దానికి వికాస్ బడిస బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే గూస్ బంప్స్ తెప్పించేలా ఉందని అనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశలో ఉన్న చిత్రాన్ని త్వరలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

Full View



Similar News