OTT : ఓటీటీలోకి వచ్చేసిన అశ్విన్ బాబు శివం భజే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఓటీటీలోకి వచ్చేసిన అశ్విన్ బాబు శివం భజే

Update: 2024-08-31 03:45 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఒకప్పుడు థియేటర్లో ఏ సినిమా విడుదలవుతుందో అని చూసే వారు.. కానీ, ఇప్పుడు రోజులు మారాయి ఓటీటీలో కొత్త సినిమాలు ఏవేమి వస్తున్నాయో చూస్తున్నారు. ప్రేక్షకులకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను తీసుకురావడానికి ఏ మాత్రం ఆలస్యం చేయడం లేదు. వాటిలో ఆహా అయితే కొత్త సినిమాలను రిలీజ్ చేస్తూ దూసుకుపోతోంది. ఇప్పటికే ఆహా ఎన్నో సినిమాలను మన ముందుకు తీసుకొచ్చింది.

తాజాగా, అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కి శివం భజే ఆహాలోకి వచ్చింది. ఈ మూవీ భారీ అంచనాల మీద రిలీజ్ అయి మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుని మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఆగస్టు 1న ఈ మూవీ థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఇప్పుడు ఈ సినిమా 30 రోజులలోపే ఓటీటీలోకి వచ్చేసింది.

ఈ మూవీలో అశ్విన్‌బాబు న‌ట‌న హైలెట్ అని చెప్పుకోవాలి ఎందుకంటే.. యాక్ష‌న్ సీన్స్ లో చించేసాడు. ఇక ఈ మూవీ స్టోరీ కథ విషయానికొస్తే.. హీరో చిన్న తనంలోనే తండ్రిని కోల్పోతాడు. అప్పటి నుంచి ఇంటిని పోషిస్తాడు. కొట్లాటల్లో చూపును కోల్పోతాడు. ఆ తర్వాత హీరోకి ట్రాన్స్‌ప్లాంటేష‌న్ జరుగుతుంది. అప్పటి నుంచి రెండు హత్యలు మైండ్ లో తిరుగుతూ ఉంటాయి. అసలు హీరోకి హత్యలు ఎందుకు గుర్తుకు వస్తున్నాయి? వాటి వెనక ఉన్న కథ ఏంటనేది తెలియాలంటే ఈ మూవీని చూడాల్సిందే!

Full View

Tags:    

Similar News