అత్యంత దారుణంగా Ashu Reddy ఆరోగ్య పరిస్థితి.. పోస్ట్ వైరల్ ఆందోళనలో ఫ్యాన్స్
బిగ్ బాస్ బ్యూటీ అషూరెడ్డికి సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రీల్స్‌తో తన అందాలను ఆరబోస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.
దిశ, వెబ్ డెస్క్: బిగ్ బాస్ బ్యూటీ అషురెడ్డికి సోషల్ మీడియాలో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రీల్స్‌తో తన అందాలను ఆరబోస్తూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. పలు సినిమాల్లోనూ ఛాన్సులు అందుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అషు రెడ్డి యాడ్ అయినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై ఈ అమ్మడు స్పందించింది. ఈ కేసులో తనకు ఏ సంబంధం లేదని ఓ పోస్టు షేర్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, అషు రెడ్డి పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చేతికి సెలైన్ పెట్టుకుని.. కుర్చీలో రెస్ట్ తీసుకుంటున్న ఫొటోను తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అంతేకాకుండా ఆమె ఆరోగ్య పరిస్థితి దారుణంగా ఉందని అమెరికాలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. త్వరగా కోలుకుని తిరిగి ఇండియాకు వస్తానని తెలిపింది. దీంతో అది చూసిన అభిమానులు అయ్యో అషుకు ఏమైంది.. చేతికి సెలైన్ ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది డ్రగ్స్ కేసు వలన ఏదైనా జరిగిందేమో? అని కామెంట్లు చేస్తున్నారు.
Read more: Ashu Reddy : డ్రగ్స్ కేసులో తెరపైకి అషురెడ్డి..అతడితో మాట్లాడిన కాల్ లిస్ట్ బట్టబయలు..!