చుట్టూ వేలాది మంది.. అందరూ చూస్తుండగానే ఆమె కాళ్లు పట్టుకున్న ఎన్టీఆర్.. ఏం జరిగిందంటే..
తెలుగు చలన చిత్ర రంగంలోనే ఆయనొక సంచలనం. తన నటన, అభినయం, వాగ్ధాటితో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన మహాను భావుడు. ఎన్నో పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి అలరించిన అందాల రేడు. తేట తెలుగు మాటలతో, పాటలతో ఆకట్టుకున్న నట సార్వభౌముడు. ఆయనెవరో కాదు.. నందమూరి తారక రామరావు.
దిశ, సినిమా : తెలుగు చలన చిత్ర రంగంలోనే ఆయనొక సంచలనం. తన నటన, అభినయం, వాగ్ధాటితో తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసిన మహాను భావుడు. ఎన్నో పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటించి అలరించిన అందాల రేడు. తేట తెలుగు మాటలతో, పాటలతో ఆకట్టుకున్న నట సార్వభౌముడు. ఆయనెవరో కాదు.. నందమూరి తారక రామరావు. ప్రస్తుతం ఆయన సినీ జీవితానికి సంబంధించి ఒక సంఘటన గురించి నెట్టింట చర్చ నడుస్తోంది. ఏంటంటే.. అప్పట్లో ఆయన ఒక హీరోయిన్ కాళ్లు పట్టుకున్నారట. దీంతో సినీ అభిమానులు, నెటిజన్లు ఎన్టీఆర్ అంతటి వ్యక్తి, రాముడు, కృష్ణుడు వంటి పాత్రల్లో నటించి ప్రజల మనస్సు దోచిన వెండితెర వేలుపు, ఒక మహిళ కాళ్లు పట్టుకోవడం ఏంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ అసలు విషయం ఏంటా? అని ఆరా తీస్తున్నారు. అయితే నాడు ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్న అలనాటి హీరోయిన్ మరెవరో కాదు ప్రముఖ నటి రోజా రమణి.
సినీ అభిమానులకు రోజా రమణి గురించి తెలిసిందే. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ఎంట్రీ ఇచ్చి అనేక చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ సినిమాల్లోనూ నటించి మెప్పించింది. అప్పట్లో ఎన్టీరామారావు వంటి సీనియర్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే అప్పట్లో ఆమె సీనియర్ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్‌గానే కాకుండా స్వయంగా ఆయన దర్శకత్వంలోనూ ఓ చిత్రంలో నటించింది. కాగా ఆ సందర్భంగా ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ఏంటంటే.. ఎన్టీఆర్ ఆమె కాళ్లు పట్టుకున్నారట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా రమణియే స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించగా ప్రజెంట్ సోషల్ మీడియాలో ఆమె మాటలు వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమాకు సంబంధించిన షూటింగ్ అప్పట్లో కృష్ణా బ్యారేజీ వద్ద ప్రారంభమైంది. రోజా రమణి సూసైడ్ చేసుకునే సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఇది చూడటానికి వేలాది మంది అభిమానులు తరలి వచ్చారు. షూటింగ్‌లో భాగంగా రోజా రమణి బ్యారేజీపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇలా చిత్రీకరిస్తున్నప్పుడు కెమెరా బ్యారేజీ కింద పెట్టారు. పైన రెయిలింగ్ కట్టారు. కానీ ఆ రెయిలింగే అడ్డుగా ఉండటంతో రోజా రమణి కెమెరాలో సరిగ్గా పడటం లేదు. పైగా ఆమె పొట్టిగా ఉండటంతో మరింత ఇబ్బంది ఏర్పడింది.
సన్నివేశ చిత్రీకరణలో భాగంగా నాటి హీరోయిన్ రోజా రమణి కాళ్ల కింద ఏదైనా ఎత్తుగా పెడదామంటే అక్కడ సమీపంలో ఏమీ కనిపించలేదట. మేకప్ ఆర్టిస్టు ఆమెను బ్యాలెన్స్ చేసేందుకు పట్టుకున్నా ఆపలేకపోయాడు. పరిస్థితి చూస్తే ఏమాత్రం ఆలస్యం చేసినా ఆమె నిజంగానే నదిలో పడిపోయేలా ఉంది. ఇది గమనించిన ఎన్టీఆర్ వెంటనే అలర్ట్ అయ్యారు. స్వయంగా ఆయనే వెళ్లి రోజా రమణి సూసైడ్ సన్నివేశ చిత్రీకరణకు హెల్ప్ చేయడంలో భాగంగా ఆమె కాళ్లు పట్టుకున్నారు. దీంతో అంతటి నటసార్వభౌముడు నా కాళ్లు పట్టుకోవడం ఏంటని రోజా రమణి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. అయితే ఇదొక షూటింగ్ కావచ్చు కానీ, తన కెరీర్‌లోనే మర్చిపోలేని సంఘటనగా నిలచిపోయిందని ఆమె గుర్తు చేశారు. ప్రజెంట్ ఆమె మాటలు నెట్టింట వైరల్ అవుతుండగా, సీనియర్ ఎన్టీఆర్ మంచి తనాన్ని మరోసారి గుర్తుకు తెచ్చారంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.