ఆ డాన్సర్‌తో లవ్‌లో Ariyana.. ఎట్టకేలకు ఓపెన్ అయిన బిగ్ బాస్ బ్యూటీ (వీడియో)
బుల్లితెరపై ప్రచారం అవుతున్న షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి.
దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెరపై ప్రచారం అవుతున్న షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ఈవారం షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ‘మొగలిరేకులు’ సీరియల్లో పోలీస్ క్యారెక్టర్‌తో ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే నాయుడు ఎంట్రీ ఇస్తాడు. అనంతరం రియల్ లైఫ్ కపుల్స్ ఒకరి తర్వాత మరొకరు వాళ్ల పార్టనర్స్‌తో ఎంట్రీ ఇస్తారు. వాళ్లతో పాటు ఇమ్మానుయేల్, వర్షాలు కూడా వస్తారు. అయితే వాళ్లిద్దరిది ఫస్ట్ నుంచి తెలిసిందే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ రియల్ జోడీస్ మధ్యలో పండు, అరియానా రావడం కొంచెం ఆసక్తికరంగా మారింది.
వీళ్లద్దరి స్టేజ్‌పై చూసి రష్మీ.. ‘ఇదెప్పటి నుంచి.. మీరిద్దరికీ ఎప్పుడు స్టార్ట్ అయింది’ అని అడుగుతుంది. దీంతో పండు.. ‘అరియానాను చూసి ఇష్టపడని వాళ్లు ఎవరు ఉంటారు చెప్పండి’ అంటూ పులిహోర డైలాగులు మొదలు పెడతాడు. అరియానా కూడా ‘‘పండు చెప్పకుండా వచ్చావ్.. చెప్పకుండా వెళ్లిపోవ్ కదా’’ అని అంటుంది. దీనికి మనోళ్లు లవ్ సాంగ్ వేసుకుని సింబల్ కూడా వేసేస్తారు. ఇక ఏముంది బుల్లితెరపై మరో జంట రచ్చ స్టార్ట్ అయింది.
loveపాపం రా.. ఆ అమ్మాయిని వదిలేయ్.. ఆర్జీవిని వేడుకుంటున్న నెటిజన్లు