Anushka Shetty: ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న అనుష్క?.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘సూపర్’ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ అతి తక్కువ టైమ్‌లోనే స్టార్ డమ్ సంపాదించుకున్నది. ఇక అరుంధతి, పంచాక్షరి, భాగమతి వంటి లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించి తన నటనతో స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ సొంతం చేసుకున్నది అని చెప్పడంలో అతియోశక్తి లేదు. ఈ క్రమంలోనే బాహుబలి 1,2 మూవీలో నటించి ఓ రేంజ్‌కు ఎదిగిపోయింది. సడెన్‌గా ఏమైందో ఏమో కానీ సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన అనుష్క.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ కొత్త ప్రాజెక్టులను లైన్లో పెడుతూ బిజీ షెడ్యూల్‌ను మెయింటైన్ చేస్తుంది ఈ బ్యూటీ.
ఇదిలా ఉంటే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా స్టిల్ బ్యాచ్‌లర్ లైఫ్‌ను గడుపుతోంది అనుష్క. ఈ క్రమంలో ఈమె పెళ్లికి సంబంధించిన చాలా రూమర్స్ కూడా వచ్చాయి. కానీ ఆ వార్తలపై ఈ బ్యూటీ ఎప్పుడూ స్పందించలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా అనుష్క పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైందని మరో వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే..
కుటుంబ సభ్యులు అనుష్క కోసం అబ్బాయిని వెతికి పెట్టారట. ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ నీ సెలక్ట్ చేశారట. అతను అనుష్కకు బాగా సెట్ అవుతాడని…. హ్యాండ్సమ్గా ఉన్నాడని…. మంచి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని తెలుస్తోంది. ఇక ఆ అబ్బాయితో వివాహానికి అనుష్క ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదట. కానీ, ఈ వివాహానికి అనుష్క ఒప్పుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ అనుష్క ఇన్ని రోజులకు వివాహానికి సిద్ధమైందని తెలిసి తన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇక ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.