త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అనుష్క? తెలంగాణ బిజినెస్‌మెన్‌తో కన్ఫామ్?
'సూపర్' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనుష్క.. 2009లో వచ్చిన అరుంధతి మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: 'సూపర్' సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన అందాల భామ అనుష్క.. 2009లో వచ్చిన అరుంధతి మూవీతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత బాహుబలి, భాగమతి వంటి చిత్రాల్లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మైమరిపించింది అనుష్క. అయితే సైజ్ జీరో సినిమా ఆమె సినీ జీవితాన్ని తలకిందులు చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమాలో పాత్ర కోసం అనుష్క చాలా బొద్దుగా తయారైంది. కానీ, ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత బరువు తగ్గడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికి.. అవి అంతగా ఫలితం ఇవ్వలేదు. దీంతో సినిమా ఇండస్ట్రీకి ఆమె కాస్త దూరం అయింది.
ఈ మధ్యకాలంలో నవీన్ పోలిశెట్టితో కలిసి మూవీ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ మూవీ ఇంకా సెట్‌పైకి రాలేదు. ఇదిలా ఉంటే.. తాజాగా అనుష్క పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనుష్క త్వరలో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి. తెలంగాణకు చెందిన ఓ గోల్డ్‌స్మిత్‌ను ఆమె పెళ్లాడేందుకు సిద్ధమవుతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. కాగా.. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉన్నది అనేది తేలాల్సి ఉంది.