పెళ్లి చేసుకోబోతున్న అనుష్క.. ఈవెంట్ కూడా ప్లాన్ చేసేస్తుందిగా.. (వీడియో)

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ జంటగా నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’.

Update: 2023-08-16 06:33 GMT
పెళ్లి చేసుకోబోతున్న అనుష్క.. ఈవెంట్ కూడా ప్లాన్ చేసేస్తుందిగా.. (వీడియో)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క, యంగ్ హీరో నవీన్ జంటగా నటిస్తున్న సినిమా ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’. పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 7న థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అవుతుంది. ఈ క్రమంలోనే మూవీ ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తున్నారు టీం. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నవీన్‌కు అనుష్క ఫోన్ చేసి మరి తన పెళ్లి ఈవెంట్ గురించి మాట్లాడింది.

అనుష్క మాట్లాడుతూ.. మన ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్ ఉంది. మీరు ఒక ప్రొఫెషనల్ స్టాండప్ కమెడియన్ అని టీజర్‌లో చూశాను. మీరు బయట కూడా చాలా ఈవెంట్స్ చేస్తుంటారని విన్నాను. సెప్టెంబర్-7 కు మీరు ఫ్రీ ఉంటారా..?

నవీన్: హా చేస్తాను. ఇంతకి ఫంక్షన్ ఏంటండి.

అనుష్క: నా పెళ్లి..

నవీన్: మీ పెళ్లా..?

ఇలా వీరి ఇద్దరి మధ్య ఫోన్ సంభాషణ నడుస్తుంది. అయితే.. ఇక్కడ విషయం ఏంటంటే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా నవీన్ ఓ ఇంటర్వ్యూకి వెళతాడు. అతనికి అనుష్క ప్రాంక్ కాల్ చేసి మాట్లాడుతుంది. 3 నిమిషాల ఈ సంభాషణలో మాట్లాడేది అనుష్క అని నవీన్ కనిపెట్టలేకపోయాడు. చివరికి మాట్లాడేది అనుష్క అని తెలిసి నవ్వుకున్నాడు.

Tags:    

Similar News