Anupama Parameswaran:అనుపమ పరమేశ్వరన్‌కు కరోనా పాజిటివ్!

దిశ, సినిమా : మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన 'కార్తికేయ 2' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనుపమ నార్త్‌, సౌత్‌‌లో చాలా ప్రదేశాలు చుట్టేసింది..Latest Telugu News

Update: 2022-08-25 06:59 GMT

దిశ, సినిమా : మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ నటించిన 'కార్తికేయ 2' మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనుపమ నార్త్‌, సౌత్‌‌లో చాలా ప్రదేశాలు చుట్టేసింది. ఈ క్రమంలోనే జలుబు, దగ్గు లక్షణాలతో బాధపడుతూ కరోనా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. దీంతో ఇంట్లోనే ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

ప్రస్తుతానికైతే కరోనా పెద్దగా ఎఫెక్టివ్ చూపడం లేదు కనుక కంగారు పడాల్సిన లేదు. ఇక 'కార్తికేయ-2' విషయానికొస్తే.. ఈ మూవీ అనుపమ కెరియర్‌ను తిరగరాసిందనే చెప్పాలి. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. నిఖిల్‌తో ఆమె నటించిన మరో చిత్రం '18 పేజెస్‌' సెప్టెంబర్ 9న విడుదలకు సిద్ధమవుతోంది. 

లేడీగా మారిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్:Nawazuddin Siddiqui 

Tags:    

Similar News