ట్విట్టర్ లో ఆంటీ ట్రెండ్.. సైబర్ పోలీసులకు Anasuya ఫిర్యాదు..!

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్, ఆర్టిస్ట్ అనసూయ లైగర్ సినిమా నెగిటివ్ టాక్ వేళ ట్విట్టర్ లో ''అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా!! అని పోస్ట్ చేశారు.

Update: 2022-08-27 12:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్, ఆర్టిస్ట్ అనసూయ లైగర్ సినిమా నెగిటివ్ టాక్ వేళ ట్విట్టర్ లో ''అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు. కర్మ.. కొన్నిసార్లు రావటం లేటవ్వచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా!! అని పోస్ట్ చేశారు. దీంతో విజయ్ దేవరకొండను అంటున్నావు అంటూ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అక్కడి తో ఆగకుండా అనసూయను కొందరు బూతులు తిట్టడం, మరి కొంతమంది ఆంటీ అని సంబోధిస్తూ ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.

దీంతో అనసూయ.. "నాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై, ముఖ్యంగా నన్ను ఆంటీ అని సంబోధించిన వారిపై కఠిన చర్యలు తప్పవు, అవసరమైతే  పోలీసు కేసులకు కూడా వెనుకాడనని శుక్రవారం ట్విట్టర్ లో #SayNOtoOnlineAbuse #StopAgeShaming అని హాష్ ట్యాగ్ లు పెడుతూ హెచ్చరించారు. అనసూయ లాస్ట్ ట్వీట్ లో జబర్దస్త్, సినిమాలు, ఇతర టీవీ షోలు నా జీవితంలో ఒక భాగం మాత్రమే. అవి ఎప్పుడూ నా జీవితం కావు. నా ప్రాధాన్యతలు మీ వెర్షన్‌లకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి అంటూ ట్వీట్ చేశారు. మరి అనసూయ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తా అని వార్నింగ్ ఇచ్చాక కూడా ఈ రోజు ట్విట్టర్ లో  #Aunty ట్రెండ్ అవుతోంది. మరి అనసూయ స్పందించి వారిపై కేసులు పెడతారా..? లేక మాటల వరకే పరిమితం అవుతారా..?  అనేది వేచి చూడాలి.

Also Read : 'లైగర్‌'తో జాన్వీ పెద్ద ప్రమాదమే తప్పించుకుంది!  

Tags:    

Similar News