టాలీవుడ్‌లో మరో విషాదం..

టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ‘మిథునం’ చిత్ర నిర్మాత మొయిద ఆనందరావు(57) కన్నుమూశారు..

Update: 2023-03-16 08:34 GMT

దిశ, సినిమా: టాలీవుడ్‌లో ఈ మధ్య కాలంలో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ‘మిథునం’ చిత్ర నిర్మాత మొయిద ఆనందరావు(57) కన్నుమూశారు. ఆయన గత కొంత కాలంగా డయాబెటిస్‌తో బాధ పడుతున్నారు. దీంతో అతని కుటుంబ సభ్యులు విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు.

ఇక విషయం తెలుసుకున్న టాలీవుడ్ ప్రముఖులు.. అతని కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నాను. ఆనందరావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కాగా విజయనగరం జిల్లా రేగిడి మండలం వావిలవలస గ్రామంలో జన్మించిన ఆనందరావు.. చిరు ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించి వ్యాపారవేత్తగా ఎదిగారు. మంచి పనులకు ముందుండే వ్యక్తిగా ఆనందరావు చాలా మంది జీవితాల్లో వెలుగులు నింపారు. ఇక ఇలా ఇంత త్వరగా ఆయనను కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం.

Tags:    

Similar News