రాజమౌళి దంపతులకు మరో గౌరవం.. ఆస్కార్ అకాడమీ నుంచి ఆహ్వానం

దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే తనకంటూ స్పెషల్ ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు.

Update: 2024-06-26 07:00 GMT

దిశ, సినిమా: దర్శక ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాలీవుడ్‌ ఇండస్ట్రీలోనే తనకంటూ స్పెషల్ ట్రాక్ రికార్డ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు మాక్సిమమ్ అన్ని బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు క్రియేట్ చేశాయి. ఆయన తీసిన ఈగ, బాహుబలి 1, 2 చిత్రాలు పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపితే ఆర్ఆర్ఆర్ చిత్రం ఏకంగా దేశానికి ఆస్కార్ తీసుకొచ్చింది. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆయన అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. ఇక తాజాగా రాజమౌళి మరో ఘనతను కూడా సాధించారు. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (AMPAS).. సింపుల్‌గా చెప్పాలంటే ఆస్కార్స్ అకాడమీలో చేరమని రాజమౌళికి ఆహ్వనం అందింది.

ఇక మొత్తం ప్రపంచవ్యాప్తంగా 487 మందికి ఈ ఆహ్వానం దక్కింది. దీంతో 2025 ఆస్కార్‌లలో ఓటు వేసేందుకు ఈ మెంబర్లు అర్హత పొందారు. ఇక ఆయన సతీమణి రమా రాజమౌళికి కూడా అకాడమీ నుంచి ఆహ్వానం రావడం మరో విశేషం. ఇంతటి గౌరవం దక్కించుకున్నందుకు రాజమౌళికి అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

కాగా భారత్ నుంచి వీరిద్దరితో పాటు మరికొందరు సినీ ప్రముఖులు కూడా ఉన్నారు. షబానా అజ్మీ, రితేష్ సిధ్వానీ, రవి వర్మన్ తదితరులు ఆహ్వానం అందుకున్న వారిలో ఉన్నారు. గత సంవత్సరం హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ఎమ్ ఎమ్ కీరవాణి, చంద్రబోస్, కె కె సెంథిల్ కుమార్, సాబు సిరిల్ వంటి వారికి అకాడమిలో చోటు దక్కింది.

Tags:    

Similar News