Anjali denies marriage rumour :ఆ కుర్రాడితో అంజలి పెళ్లి అయిపోయిందా..!

హీరోయిన్ అంజలి పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Update: 2022-12-12 14:03 GMT

దిశ, సినిమా: హీరోయిన్ అంజలి పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనికి కారణం ఆమె ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్. తాజాగా పోల్ అంటూ పిలుస్తూ.. 'మై హార్ట్ బేబీ .. జాయిన్ ఇన్ టు మై లైఫ్ ఎవ్రీ సింగిల్ మూమెంట్' అంటూ బర్త్ డే విషెష్ పెట్టింది. దీంతో పెళ్లి చేసుకొన్న అంజలి ఎవరికీ చెప్పలేదని నెటిజన్లు వాపోతున్నారు. తాజాగా ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చారు అంజలి.

ప్రస్తుతం ఆమె నటించిన వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా తన పెళ్లి గురించి వస్తున్న రూమర్స్‌పై క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ ''ఇప్పటికే నా పెళ్లి గురించి రకరకాల వార్తలు వచ్చాయి. నేను అమెరికాలో బిజినెస్ మెన్‌ను పెళ్లి చేసుకుని, అక్కడే సెటిల్ అయినట్లు కూడా రాశారు. కానీ అంతా అబద్ధం. ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకునే ఆలోచనే లేదు. నేను పెళ్లి గనుక చేసుకుంటే అందరికీ చెప్తాను' అని చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

'waltair veerayya' లో Ravi Teja First Look 


Similar News