మొగుడి కన్నా పశువులు నయం.. పెళ్లితో వచ్చేది లేదు పోయేది లేదు : Sadha

' జయం ' మూవీ తో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది సదా. ప్రజంట్ పలు షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇక పోతే ఈ నటి ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అయితే అందరూ తన మ్యారేజ్ గురించి అడుగుతుండటంతో

Update: 2023-07-06 07:12 GMT

దిశ, సినిమా: ' జయం ' మూవీ తో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది సదా. ప్రజంట్ పలు షోలలో జడ్జ్ గా వ్యవహరిస్తోంది. ఇక పోతే ఈ నటి ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అయితే అందరూ తన మ్యారేజ్ గురించి అడుగుతుండటంతో తన ఉద్దేశం ఏంటో చెప్పుకొచ్చింది. 'అందరు నన్ను నువ్వు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదని అడుగుతున్నారు. చేసుకోలేదు కాబట్టి నేను ఇలా హ్యాపీగా ఉంటూ.. నా ఇష్టం వచ్చినట్లు స్పెండ్ చేయగలుగుతున్నాను. అంటే కొందరు పార్టనర్ లు చాలా సపోర్ట్ గా ఉంటారు. కానీ మనకు తగ్గవారు దొరకడం మాత్రం చాలా కష్టం. అలా చూసుకుంటే నా లైఫ్ చాలా డిఫరెంట్ . నాకు జంగల్ వెళ్లడం.. జంతువులను చూడటం చాలా ఇష్టం.. టైం ఉన్నప్పుడల్లా అడవిలో పిచ్చి పిచ్చిగా తిరిగొస్తాను. కానీ మ్యారేజ్ చేసుకుంటే.. ఇవ్వన్నీ మర్చిపోతాం. ఇద్దరిలో ఎవరో ఒక్కరు సర్దుకోవాలి వస్తుంది. అలా ఎందుకవ్వాలి. నాకు జంతువులు మాత్రమే కావాలి. ఇప్పుడు చాలా మంది విడిపోయి విడాకులు తీసుకుని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అడ్జస్ట్ అవ్వకపోతే .. సెపరేట్ గా ఉండటమే బెటర్. విడిపోవడం తప్పేం కాదు’ అంటూ చెప్పుకొచ్చింది సదా.

Read More:

ఒక్క రాత్రికి రూ.40 లక్షలు వసూలు చేస్తున్న హీరోయిన్.. ఆమె దగ్గరికి వచ్చేది పొలిటీషన్సే! 

ఆ క్యారెక్టర్లు బోర్ కొట్టేశాయి.. అందుకే రూట్ మార్చేశా: హ్యూమా 

Tags:    

Similar News