ఆ స్టార్ హీరోలతో మ్యాజిక్ చేయనున్న అనిల్ రావిపూడి

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత వరకు ఫెయిల్ అవ్వని దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకరు.

Update: 2024-06-12 04:05 GMT

దిశ, సినిమా: తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇంత వరకు ఫెయిల్ అవ్వని దర్శకుల్లో అనిల్ రావిపూడి కూడా ఒకరు. వినోదాత్మక చిత్రాలను తీయడంలో ఇతను తర్వాతే ఎవరైనా..! స్టార్ హీరో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన మూవీ ఎఫ్2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ ఎంత పెద్ద హిట్ అయిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా సీక్వెల్ ఎఫ్3 కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాలకు ధీటుగా మరో కొత్త మూవీతో సందడి చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి.

గత రెండు చిత్రాలను నిర్మించిన దిల్ రాజు ఈ చిత్రాన్ని కూడా నిర్మించనున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన వెంకటేష్, వరుణ్ తేజ్ ఈ చిత్రంలో కూడా హీరోలుగా కనిపించనున్నారని తెలుస్తోంది. రెండు చిత్రాలు హిట్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేసింది. సంక్రాంతి సందర్బంగా విడుదలైన రెండు సినిమాలు అవార్డ్స్ గెలుచుకున్నాయి.

అయితే ఎఫ్4 సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. వెంకటేష్ ఇటీవల సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.. కానీ, ఈ మూవీ అవ్వలేదు. హిట్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఆశించిన స్థాయిలో ఆడలేదు. మరి, ఇప్పుడు తీయబోయే సినిమాతోనైనా హిట్ కొడతాడో? లేదో ? చూడాల్సి ఉంది.


Similar News