Suma Kanakala :డబ్బు కోసం అలాంటి పని చేసిన యాంకర్ సుమ.. నెటిజన్లు ఫైర్
టాలీవుడ్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.
దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీలో నెంబర్ వన్ యాంకర్‌గా పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. మరోవైపు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ.. నెట్టింట చాలా యాక్టీవ్‌గా ఉంటారు. అయితే ఇటీవల సుమ సోషల్ మీడియా వేదికగా కొన్ని ప్రొడక్ట్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు. తాజా ఫుడ్, పచ్చళ్లు ప్రమోట్ చేస్తున్న వీడియోను నెట్టింట పంచుకోవడంతో నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ‘‘ఈ ఫుడ్ ప్రొడక్ట్స్ చాలా చెత్తగా ఉన్నాయి. అంతగా రుచి కూడా లేవు. పికిల్స్ నాసిరకంగా ఉన్నాయి. ఇంటికి వచ్చే లోపే ఫుడ్ పాడైపోతున్నాయి.’’ అంటూ సుమపై పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. అలాగే ఓ నెటిజన్ ‘ఇప్పటివరకు భారీగానే డబ్బు కూడబెట్టావు కదా? ఛీప్‌గా ఇలాంటి వాటిని కూడా ప్రమోట్ చేస్తూ పరువు తీసుకోవడం అవసరమా’’ అని కామెంట్ పెట్టాడు.
Read More: పెళ్లి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది శోభనమే.. నటి హాట్ కామెంట్స్ వైరల్