తోటి యాంకర్లతో కలిసి ఓనం వేడుకలో సందడి చేస్తోన్న యాంకర్ సుమ, అనసూయ..

కేరళా పండుగ ఓనం పర్వదినాన్ని పురస్కరించుకొని మన తెలుగు యాంకర్స్ ట్రెడిషన్ లుక్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటున్న పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Update: 2023-08-30 06:31 GMT
తోటి యాంకర్లతో కలిసి ఓనం వేడుకలో సందడి చేస్తోన్న యాంకర్ సుమ, అనసూయ..
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: కేరళా పండుగ ఓనం పర్వదినాన్ని పురస్కరించుకొని మన తెలుగు యాంకర్స్ ట్రెడిషన్ లుక్‌లో నెటిజన్లను ఆకట్టుకుంటున్న పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా ఈ వేడుకను టాలీవుడ్ స్టార్ యాంకర్స్‌గా పేరు తెచ్చుకున్న సుమ, అనసూయ, రష్మి గౌతమ్, శిల్ప చక్రవర్తి, గీతా భగత్ కలిసి ఓనం ఫెస్ట్‌ను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. వీరితో పాటు అనితా చౌదరి, ప్రవీణ, యాంకర్ రవి కూడా సందడి చేశారు. ఈ సందర్భంగా వీరందరూ కలిసి గుడికి వెళ్లారు. సరదాగా అక్కడ ఫొటోలకు ఫోజులిచ్చారు. ప్రత్యేకంగా ఈ యాంకర్స్ కేరళా సాంప్రదాయ చీర కట్టులో అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు సుమ తన భర్త రాజీవ్ కనకాల ఆశీస్సులు తీసుకుంటూ కనిపించిన పిక్ హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ యాంకర్లందరూ కలిసి సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Tags:    

Similar News