ప్రభాస్‌తోనే నా పెళ్లి.. స్వయంగా ప్రకటించిన యాంకర్ శ్రీముఖి

బుల్లితెర ముద్దు గుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2023-06-10 09:16 GMT

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర ముద్దు గుమ్మ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంకర్‌గా బుల్లితెరపై మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ భామ.. బిగ్ బాస్ షో అనంతరం మరింత పాపులారిటీ దక్కించుకుంది. సోషల్ మీడియాలో బిజీగా ఉండే ఈ బ్యూటీ.. తన అందాలతో కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. ఇంత వయసు వచ్చిన పెళ్లి చేసుకోవా అంటూ శ్రీముఖిపై అనేక సార్లు ట్రోల్స్ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఓ షోలో పెళ్లిపై స్పందించింది. స్టార్ మా పరివార్ షోలో శ్రీముఖి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ షోలో బుల్లితెర ఆర్టిస్టులు పాల్గొని సందడి చేస్తారు.

ఈ క్రమంలోనే తాజా ఎపిసోడ్‌లో మొగుడ్స్ వర్సెస్ పెళ్లమ్స్ ఎపిసోడ్ ప్రోమో ఎంతో సందడిగా సాగింది. ఇక ఇందులో ఫైమా.. నీకు అప్పుడు పెండ్లీ వద్దా అని అడిగింది. దానికి శ్రీముఖి నా అందానికి ఏ హీరో సెట్ అవుతాడు అని అడుగుతుంది. వెంటనే ఫైమా ప్రభాస్ ఒక్కడే సింగిల్‌గా ఉన్నాడు అంటే.. ఆయన ఒప్పుకోవాలే కానీ ఎగిరి గంతేసి మరి చేసుకుంటా అంటుంది శ్రీముఖి. దానికి ఫైమా ఎక్కడా కలలోనా అని పంచ్ వేస్తుంది. కాగా.. ప్రభాస్ ఒకే చెప్తే పెళ్లి చేసుకుంటా అని శ్రీముఖి మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Tags:    

Similar News