ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న Anchor Pradeep !
ప్రదీప్ మాచిరాజు పేరు వినగానే మనకి బుల్లితెర సందడి గుర్తొస్తుంది.
దిశ, వెబ్ డెస్క్ : ప్రదీప్ మాచిరాజు పేరు వినగానే మనకి బుల్లితెర సందడి గుర్తొస్తుంది. అతి తక్కువ సమయంలో మంచి పేరు తెచ్చుకున్న యాంకర్స్ లిస్టులో ప్రదీప్ కూడా ఒకరు. షో ఏదయినా సరే..ఆ ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉంటాయి. అటు బుల్లి తెర ప్రేక్షకులకు , ఇటు వెండితెర ప్రేక్షకులకు ఫేవరెట్ యాంకర్‌గా మారిపోయాడు. బుల్లి తెర మాత్రమే కాకుండా వెండితెర పై ఈ యాంకర్ కొన్ని సినిమాల్లో నటించారు. 30 రోజులలో ప్రేమించడం ఎలా అనే సినిమాలో హీరోగా నటించి, ఆ సినిమాతో హిట్ కూడా కొట్టాడు. ఇలా బిజీ బిజీగా ఉంటున్న యాంకర్ పై తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రదీప్ ప్రేమ పెళ్లి చేసుకుంటున్నాడని..ఆ విషయం ఇంట్లో కూడా చెప్పాడని తెలిసిన సమాచారం. దీనిపై అధికారికంగా ఏ ప్రకటన రాలేదు..అలాగే ప్రదీప్ కూడా ఈ విషయం పై ఇంకా స్పదించలేదు.
Also Read....
Ram Charan వారసుడికి ముందే పేరు ఫిక్స్ చేసిన చిరు.. ఏం పేరో తెలుసా?