పవన్ కల్యాణ్ పై సంచలన కామెంట్స్ చేసిన అనసూయ!
బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హాట్ యాంకర్ అనసూయ.
దిశ, సినిమా: బుల్లితెర జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది హాట్ యాంకర్ అనసూయ. ఈ బ్యూటీ స్టేజీపై యాంకరింగ్ చేసే స్థాయి నుంచి వెండితెరపై కీలక పాత్రల్లో నటించే స్థాయికి వెళ్లింది. విమానం, పెద్ద కాపు 1, ప్రేమ విమానం, రంగస్థలం, ఖిలాడీ, పుష్ప, రంగమార్తాండ, యాత్ర వంటి సినిమాల్లో నటించి తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రీసెంట్ గా అనసూయ ముఖ్య పాత్రలో నటించిన ‘రజాకార్’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ మూవీలో అనసూయ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 చిత్రంలో నటిస్తోంది. ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రల్ని పోషిస్తూ.. ఆడియన్స్ ను అలరిస్తుంది. అయితే తాజాగా ఈ హాట్ యాంకర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది. తన కెరీర్ తో పాటు పలు అంశాలపై మాట్లాడింది. అనంతరం యాంకర్, పవన్ కల్యాణ్ పిలిస్తే జనసేన పార్టీ తరపున ప్రచారం చేస్తారా? అని అడగ్గా.. యాంకర్ అనసూయ దీనికి బదులిస్తూ.. ‘నాకు పార్టీతో సంబంధం లేదు. వ్యక్తి గుణం మాత్రమే ముఖ్యం.
ఫస్ట్ పోటీ చేసే పర్సన్ గురించి కంప్లీట్ గా తెలుసుకుంటాను. తర్వాత నాకు ఓకే అనిపిస్తే తప్పకుండా ప్రచారం చేస్తానని’ యాంకర్ చెప్పుకొచ్చింది. తర్వాత నాగబాబు-రోజా చెరొక పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా? మీరు ఎవరికి సపోర్ట్ అని అడుగుతుంది. దీనికి అనసూయ ‘నేను నాగబాబు అండ్ రోజా ఇద్దరితో క్లోజ్ గా నే ఉంటాను. కాకపోతే నాగబాబు తోనే కొంచెం ఎక్కువగా బాండింగ్ ఉంటుంది’. అంటూ అనసూయ వెల్లడించింది. ప్రస్తుతం హాట్ యాంకర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.